- Advertisement -
వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు? – ఎమ్మెల్సీ కవిత
The concern of peanut farmers or CM Revanth Reddy? - MLC Kavita
హైదరాబాద్
అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ఒకపక్క వ్యాపారుల మోసం, మరొపక్క ప్రభుత్వం శీతకన్ను వేయడం వల్ల వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
పోలీసుల బందోబస్తు నడుమ వేరుశనగ కొనుగోలు జరపాల్సిన దుస్థితి రావడం దారుణం. రైతుల పాలిట రాబందుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించబోదు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. తక్షణమే ప్రభుత్వం మేల్కొని వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమిషన్ దారుల ఆగడాలను అరికట్టాలని అన్నారు.
- Advertisement -