మున్నూరు కాపులకు కాంగ్రెస్ సర్కార్ వెన్నుపోటు
కులగణన సర్వేలో జనాభా దారుణంగా తగ్గింపు
The Congress government has turned its back on Munnuru kapu
వాయిస్ టుడే :హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాల్లో రెండవ అతిపెద్ద సామాజికవర్గమైన మున్నూరు కాపు పై కాంగ్రెస్ సర్కారు తన అక్కసును వెళ్లగక్కింది. తాజాగా జరిపిన కులగణనలో కేవలం 13 లక్షల మంది మున్నూరు కాపులే ఉన్నారని తప్పుడు లెక్కలు చూపి ఆ కులానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తుంది. ఒక్క ఉత్తర తెలంగాణలోనే దాదాపు 13 లక్షల ఓటర్లు కలిగిన సామాజికవర్గం రాష్ట్రం మొత్తం 13 లక్షల జనాభా మాత్రమే ఉన్నట్లు చూపించి మున్నూరు కాపులను అణగదొక్కేందుకు చూస్తుంది. మున్నూరు కాపులలో ఎక్కువశాతం మంది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైపు మొగ్గు చూపుతుండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందనే భయంతోనే సర్కారు ఇలా కులగణనలో తప్పులు లెక్కలు చూపిస్తుంది. దీంతో ఆ సామాజికవర్గంవారు సర్కారు చేపట్పిన కులగణనపై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో 2014, 2024లో జరిగిన రెండు సమగ్ర కుటుంబ సర్వేలను నిశితంగా పరిశీలిస్తే అనేక తప్పిదాలు వెలుగులోకి వస్తున్నాయి. 2014 సర్వేలో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం, 2024 సర్వేలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కులగణనలో మార్పులుచేర్పులు చేసుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర జనాభాల్లో అత్యధికంగా ఉండే బీసీల సంఖ్యను తమ ప్రయోజనాల కోసం తక్కువగా చూపించే ప్రయత్నం చేశాయి. 2014లో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర జనాభాలో 51% అంటే దాదాపు 1.85 కోట్ల మంది బీసీ ఉన్నారని తమ సర్వేలో పేర్కొంది. ఆ సర్వేలో మున్నూరు కాపు కమ్యూనిటీ బీసీలో అతిపెద్ద సామాజికవర్గంగా ఉద్భవించింది. జనాభాలో 9% మంది అంటే 28 నుండి 30 లక్షల వరకు మున్నూరు కాపులు ఉన్నారని ఆ సర్వే పేర్కొంది. 4 ఉపకులాలు కలిగిన ముదిరాజ్ సామాజికవర్గం 31 లక్షల జనాభాతో రెండవ స్థానంలో ఉన్నట్లు కూడా ఆ సర్వే తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో యాదవ్, గౌడ్, పద్మశాలి కులాలు ఉన్నట్లు సర్వే ఫలితాల్లో వెల్లడైంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన సర్వే ఫలితాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. తాజా సర్వేలో 1.64 కోట్ల బీసీల జనాభా తగ్గించి చూపించారు. మున్నూరు కాపు జనాభానైతే ఉద్దేశపూర్వకంగానే 13 లక్షలకు తగ్గించారని మున్నూరు కాపు కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాంతోపాటు ఇతర బీసీ కులాల జనాభా లెక్కల్లో కూడా అవకతవకాలు జరిగాయని, గతంలో రెండవ స్థానంలో ఉన్న ముదిరాజ్ సామాజికవర్గం ఇప్పుడు 26 లక్షల జనాభాతో అతిపెద్ద బీసీ కులంగా ఉందని, ఆ తర్వాత స్థానంలో యాదవ, గౌడ సామాజికవర్గాలు ఉన్నాయని తప్పుడు లెక్కలను చూపించారు. 2014 సర్వేలో మొదటి స్థానంలో ఉన్న మున్నూరు కాపు కులాన్ని ఈసారి నాల్గవ స్థానంలో చేర్చారు. దీంతో బీసీల జనాబా గణనీయంగా తగ్గడం, మున్నూరు కాపు సామాజికవర్గం జనాభా గణాంకాల్లో తీవ్ర అవకతవకలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు పరిపాలించిన కేసీఆర్‌ను, కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి గత సర్వాత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచినందుకే కాంగ్రెస్ సర్కార్ మున్నూరు కాపులతోపాటు కొన్ని బీసీ సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుందని ఆయా కులాలకు చెందిన పెద్దలు ఆరోపిస్తున్నారు. సర్వే ఫలితాల్లో హెచ్చుతగ్గుల వలన ఆయా కులాల రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల అమలు మరియు సామాజిక సంబంధాలపై తీవ్ర ప్రబావం చూపిస్తుంది. దీనివలన భవిష్యత్తులో మున్నూరు కాపు కమ్యూనిటీ రాజకీయ ప్రాతినిధ్యం మరింత తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఇది రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కులాల అసమతుల్యతలను మరింత పెంచుతుంది. కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన సర్వేలో మొత్తం జనాభాలో 13% ముస్లింలు ఉన్నట్లుగా చూపించారు. అందులో 10% ముస్లింలను బీసీలుగా గుర్తించారు. ఇలా చేయడం ద్వారా ముస్లిం ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని మనం భావించవచ్చు. దీనివలన ఇతర వర్గాలలో అనవసర రాద్ధాంతానికి ఇది దారితీస్తుంది. జనాభా గణాంకాలను సంక్షేమం కోసం కాకుండా రాజకీయ అవసరాలకు వినియోగించి రాష్ట్రంలో సామాజిక అసమానతలను మరింతగా పెంచే ప్రయత్నం జరుగుతుందని కొందరు విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రజల భాగోగులు కోసం కాకుండా తమ సొంత ప్రయోజనం కోసం ఇలా సర్వేల పేరుతో ప్రజల మధ్య అంతరాలను మరింత పెంచే ప్రయత్నాలు చేయడం వలన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు సార్వత్రిక ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజికవర్గంతోపాటు మరికొన్ని బీసీ కులాల ప్రాతినిధ్యం తగ్గి ఆ కులాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది