మంథని నియోజక అభివృద్ధి తమ ధ్యేయం
అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించండి
ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని: కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం అభివృద్ధికి పాటు పడుతుందని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణా రాష్టం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ,సోనియా గాంధీ అని ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. నీళ్లు, నియామకాలు, నిధులు పెద్ద ఎత్తున మన ప్రాంతానికి తీసుకువస్తానని ,ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దుతానని హామీ ఇచ్చారు.మంథని నియోజక వర్గ ప్రజలు తమ విలువైన ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆరు గ్యారంటీ పథకాలు ప్రవేశ పెట్టమని, రైతులు, రైతు కూలీల కోసం అనేక పథకాలు, అదేవిధంగా ప్రతీ కుటుంబానికి ఇల్లు ఉండాలని ,అందరికీ ఉచిత విద్య, వైద్యం కల్పిస్తామన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు.