దోషుల్ని కఠినంగా శిక్షించాలని మానవహారం

- Advertisement -

దోషుల్ని కఠినంగా శిక్షించాలని మానవహారం

The culprits should be severely punished

పరవాడ,
మండల కేంద్రం అయ్యిన పరవాడలో బుధవారం పరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట  గాజువాక ఎలమంచిలి మెయిన్ రోడ్డు పై  సీఐటీయూ, సఫీ , ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు.అత్యాచారానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకుని శిక్షించాలని నినాదాలు చేశారు. బెంగాల్ ప్రభుత్వం అసలు దోసులను దాచి పెడుతూ, ఒక్కరినీ మాత్రం అరెస్టు చేయటం దుర్మార్గం అని, మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుందని, పని ప్రదేశాల్లో నే కాకుండా, ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుందని కనీసం ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని, మహిళలకు పిల్లలకు రక్షణ కల్పించాలని, మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారాలు భారతావని సిగ్గుపడేలా ఉన్నాయని, దోషులను కఠినంగా శిక్షించేంతవరకు పోరాటాలు సాగుతూనే ఉంటాయని, గతంలో ఢిల్లీ  నడిబొడ్డులో జరిగిన నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా నేరస్తులకు కఠినమైన శిక్షలు పడటం లేదని ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు  గని శెట్టి సత్యనారాయణ  అన్నారు.   వేలాదిమంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ కే ప్రాణరక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఈ దేశంలో గోవులకు రక్షణ చట్టం ఉందని కానీ దేశవ్యాప్తంగా మహిళా ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం విచారకరమన్నారు దోసెలను కఠినంగా శిక్షించి చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని గని శెట్టి హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో  కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు  కే ప్రశాంతి, పి అనిత, కే లావణ్య,బి గౌరీ,వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular