తెలంగాణ లో దాడుల సంస్కృతి మంచిది కాదు
హైదరాబాద్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుని మంత్రి కేటీఆర్ పరామర్శించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నిన్న అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో కలిసి బాలరాజు మీద దాడి చేశాడు. తెలంగాణ లో దాడుల సంస్కృతి మంచిది కాదని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు బాలరాజు సతీమణిని కూడా అవమాన పరిచేలా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఈ సంస్కృతి ని ప్రవేశపెడితే తప్పకుండా అనుభవిస్తారు. శాంతి భద్రతలపై డిజిపి కి విజ్ఞప్తి
చేస్తున్నాము బాలరాజు కి సెక్యూరిటీ పెంచాలని కోరుతున్నా. వచ్చేది మా ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరుతున్నా. ఒక
దళిత బిడ్డ మీదనే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఇంకా ఇంకా ఎలా ఉంటుందని అన్నారు.