బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలే మాకు శ్రీరామరక్ష

- Advertisement -
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలే మాకు శ్రీరామరక్ష

: కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ .

కార్యకర్తలే మా బలం, ప్రజలే మా బలగం: ప్రభుత్వ విప్, అరేకపూడి గాంధీ .

కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ , కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ .

గాంధీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ , పలువురు యువనాయకులు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుండి కార్యకర్తల నుండి పుట్టిన పార్టీ అని అన్నారు. బలమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే మా గుండె ధైర్యంమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలే మాకు శ్రీరామ రక్ష అని, పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వమే మన బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలోనే అభివృద్ధి తో పాటు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. కేసీఆర్ దక్షితకు, దార్శనికతకు నేడు మనం చూస్తున్న తెలంగాణ అభివృద్దే నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గాంధీ , కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ , యువ నాయకులు ఆదిల్ పటేల్ , సీనియర్ నాయకులు కృష్ణ , పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular