- Advertisement -
ఒక్కరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం
The district administration took up the distribution of pensions one day earlier
పుట్టపర్తి –
సెప్టెంబర్ నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే అధికారులు పంపిణీ చేసారు. కలెక్టర్ చేతన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను పంపిణీ చేసారు. ఒకటో తేదీ ఆదివారం రావడంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆగస్టు 31వ తేదీనే వీలైనంత వరకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టింది. నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే సింధూర, కొత్తచెరువు మండల కేంద్రంలో కలెక్టర్ చేతన్ పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేశారు. ఎమ్మెల్యే సింధూర మాట్లాడుతూ ఉదయం 6 గంటలకే ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛను పంపిణీ పండుగ ఒకరోజు ముందుగానే రావడం సంతోషకరమన్నారు. ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను అందజేస్తుంటే అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. ప్రతినెలా వచ్చే పింఛను సొమ్ము మీకు ఒక ఆర్థిక భరోసా అని ఈ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
- Advertisement -