సీఎం చంద్రబాబునాయుడు శ్రీశైలం పర్యటన
భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
శ్రీశైలం
The district SP inspected the security arrangements for CM’s visit
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో ర్యటించనున్న సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సీఎం పర్యటించే ప్రదేశాలలో పర్యటించి తీసుకోవలసిన భద్రత చర్యల గురించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ముఖ్యమంత్రి శ్రీశైలం చేరుకున్నప్పటినుండి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1100 మంది పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.సుండిపెంట హెలిపాడ్ నుండి టెంపుల్ వరకు మరియు హెలిపాడ్ నుండి పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సుమారు 180 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఒక డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించారు..గ్రేహౌండ్స్ మరియు స్పెషల్ పార్టీ బలగాలతో శ్రీశైలం అడవులన్నింటిని జల్లెడ పట్టడం జరిగింది.