మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

- Advertisement -

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

జగిత్యాల,
:పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ఫ్రిత్ సింగ్ పోలీసులకు సూచించారు.
గురువారం ఎస్పీ మేడిపల్లి   పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్,  ఎస్ హెచ్ వో,  రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు. 5 ఎస్ అమలు తీరును పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది  ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ  ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24 x 7 గస్తీ నిర్వహించాలని ,  సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలన్నారు.
ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.
గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని ఎస్పీ సూచించారు.
ఈ  కార్యక్రమంలో కోరుట్ల సీ.ఐ ప్రవీణ్ కుమార్, ఎస్.ఐ శ్యామ్ రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular