21.2 C
New York
Friday, May 31, 2024

తమ్ముడు కోసం అన్నయ్య రంగంలోకి దిగుతున్నారు

- Advertisement -

మ్ముడు కోసం అన్నయ్య రంగంలోకి దిగుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి మద్దతుగా మెగా హీరోలు ప్రచారంలోకి వస్తున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది.

మే 5న పిఠాపురం లో

చిరంజీవి, నాగబాబు, రాం చరణ్ కలిసి మే 5వ తేదీన పిఠాపురం లో రోడ్ షోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా కాలం తరువాత చిరంజీవి రాజకీయంగా ప్రచారానికి వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ తో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి కనిపిస్తోంది. చిరంజీవి తన ప్రచారంలో జగన్ ను టార్గెట్ చేస్తారా లేక కేవలం పవన్ ను గెలిపించమని కోరటం వరకే పరిమితం అవుతారా అనేది రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. అయితే, చిరంజీవిని అనకాపల్లిలోనూ ప్రచారం చేయాలని సీఎం రమేష్ కోరుతున్నారు. దీని పైన చిరంజీవి నిర్ణయం ఏంటనేది వెల్లడి కావాల్సి ఉంది. చిరంజీవి ప్రచారంలో అభిమానులతో పాటుగా జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు పాల్గొనేలా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో, దాదాపు పదేళ్ల తరువాత చిరంజీవి రాజకీయ పాత్ర పైన ఆసక్తి కొనసాగుతోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!