21.2 C
New York
Friday, May 31, 2024

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం  శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారాలకు బ్రేక్.

- Advertisement -

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
 శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారాలకు బ్రేక్.
బద్వేలు
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నేటితో ముగియనుంది. అధికారికంగా రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న జాతీయ చేశారు. ఏప్రిల్ 25న నామినేషన్లకు గడువు విధించారు. 26న నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. 29న ఉపసంహరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తి అవ్వగానే మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశాక తమ తమ ప్రచారాలను ప్రారంభించారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పటినుంచో ప్రచారాన్ని ప్రారంభించేశాయి. కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు,, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ పేర్లు ఎన్నో నెలలకు ముందే ఖరారు అయ్యాయి .దీంతో అప్పటి నుంచే అవకాశం ఉన్న అన్ని మార్గాలలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి వేదికను ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ జారీ తర్వాత నామినేషన్ల స్కూటీని అనంతరం మొత్తం 13 మంది అభ్యర్థులు కుప్పం అసెంబ్లీ పోరులో నిలిచారు. ఇందులో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మరియు బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఇతర పార్టీల తరఫున మరియు ఇండిపెండెంట్ లగా మొత్తం 13 మంది అభ్యర్థులు రంగంలో నిలిచి ప్రచార పర్వంలో దిగారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారాలతో పాటు మాస్ ప్రచారాలను సైతం పార్టీల అభ్యర్థుల తరఫున నిర్వహించారు. మరో పక్కన డిజిటల్ వాహనాల ద్వారా భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన డిజిటల్ వాహనాలు ప్రచారాన్ని నిర్వహించాయి. డిజిటల్ వాహనాలకు అమర్చిన భారీ మైక్ సెట్ ల ద్వారా ప్రచారం నిర్వహించారు .ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రచార కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున ఎన్నికల నియమావళి మేరకు ప్రచారాలను నిలుపుదల చేయాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటలకు అన్ని ప్రచారాలను నిలిపివేయాల్సి ఉంది. దీంతో ప్రచారాలకు బ్రేక్ పడనుంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!