జిల్లాలో  పోలీసుల అత్యుత్తమ పనితీరు  అభినందనీయం

- Advertisement -

జిల్లాలో  పోలీసుల అత్యుత్తమ పనితీరు  అభినందనీయం

The excellent performance of the police in the district is commendable

ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీసు సేవలు అందించాలి.
డిజిపి  ద్వారక తిరుమల రావు
శ్రీకాకుళం జనవరి 28
జిల్లాలో  పోలీసుల అత్యుత్తమ పనితీరు  అభినందనీయం అని జిల్లా పోలీసు అధికారుల, సిబ్బంది పనితీరు ప్రశంసించి,ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీసు సేవలు అందించి జిల్లా, రాష్ట్ర పోలీసు శాఖ యొక్క కీర్తి ,పేరు ప్రతిష్టలు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర డిజిపి శ్రీ ద్వారక తిరుమల రావు ఐపియస్ గారు పోలీసు అధికారులు ను సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం  ఉదయం  డిజిపి  ద్వారకా తిరుమలరావు  శ్రీకాకుళం జిల్లాకు వచక్చారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాల్లో గల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత 7 నెలలో జిల్లాలో  పోలీసుల అత్యుత్తమ పనితీరుతో మంచి ఫలితాలు సాధించడం అభినందనీయం అని జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పనితీరు ప్రశంసించి,ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీసు సేవలు అందించి జిల్లా,రాష్ట్ర పోలీసు శాఖ యొక్క కీర్తి ,పేరు ప్రతిష్టలు పెంపొందించాలని రాష్ట్ర డిజిపి పోలీసు అధికారులు ను సూచించారు.ప్రజలకు మేరుగైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేయాలి ఆన్నారు.విజబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి అని,సైబర్ నేరాలను కట్టడికి విస్తృతంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సైబర్ నేరాలు చేదించాలన్నారు.బీహార్ సూఫారి గ్యాంగ్ తో సహా, టెంపుల్, చైన్ స్నాచర్ల నేరస్తులు పట్టుకోవడంలోను , ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీ రికవరీ లో జిల్లా పోలీసులు  ప్రతిభకు నిదర్శమని కొనియాడారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులు  చేదించడం చాలా గొప్ప విషయమని, ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular