
కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది.
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.
విజయవంతగా వర్ధన్నపేట నియోజకవర్గం బహిరంగ సభ.
వర్ధన్న పేట 14 నవంబర్, వాయిస్ టుడే ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపురంలో పార్టీ ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కాంగ్రెస్ జెండా వదలని కార్యకర్తలు నాయకులను అభినందించారు. వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. 2014 కు ముందు చెప్పులు కూడా సరిగా లేని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ల్యాండ్ పూలింగ్ పేరుతో పేద ప్రజల భూములను లాక్కునే ప్రయత్నం చేశారని విమర్శించారు. అభివృద్ధి ముసుగులో బి ఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్లు దోచుకున్నట్లు తెలిపారు. కెసిఆర్ అవినీతి కారణంగానే మేడిగడ్డ కుంగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడోసారి మాకే అధికారం ఇవ్వమని కేసీఆర్ అనడం మరోసారి తెలంగాణ ప్రజలను దోచుకోవడానికేనని విమర్శించారు. నిరుద్యోగుల సమస్య తీరలేదని అన్నారు. తెలంగాణ లో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదు కానీ కెసిఆర్ కుటుంబము లో అందరికి ఉద్యోగాలు వచ్చాయి అన్నారు ఉద్యోగాలు రాక ప్రవల్లిక లాంటి విద్యార్థులు చనిపోతున్నారని అన్నారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఆమె మాటను నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కాంగ్రెస్కు ఓటు వేయాలని రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని దృఢ సంకల్పంతో ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలతో పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని రేవంత్ రెడ్డి చెప్పారు. సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు, అద్దంకి దయాకర్, వరద రాజేశ్వరరావు, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, సిరిసిల్ల రాజయ్య అయూబ్ తదితర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.



