- Advertisement -
ఆ విద్యార్దుల కుటుంబాలను ఆదుకోవాలి
The families of those students should be supported
హైదరాబాద్
గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలని, ఫుడ్ పాయిజన్, కరెంట్ షాక్, ఆత్మహత్యలతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. శనివారం నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వాంకిడి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని శైలజాను కవిత పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వెంటిలేటర్ పై ఉన్న విద్యార్థిని పరామర్శించడం బాధాకరమైన పరామర్శని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కలిసి వేస్తుందన్నారు. అన్ని సంక్షేమ శాఖలను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు విద్యార్థుల మరణాలపై దృష్టి సారించడం లేదంటూ కవిత ప్రశ్నించారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన వసతులు కల్పించామని వారి కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో అధ్వానంగా తయారయ్యాయని ఆమె మండిపడ్డారు నారాయణపేట్ పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంపై సీఎం సమీక్ష జరిపిన మర్చంట్రోజే మళ్లీ అదే సంఘటన పునరావృతం కావడంపై ఆమె మండిపడ్డారు. నెలకు మొక్కలు చొప్పున 42 మంది విద్యార్థులు ముత్తువార్త పడితే ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కవిత ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పాఠశాలలో చేరే వాళ్ళని ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడానికి చేరుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో మృతి చెందిన విద్యార్థులకు తక్షణ 10 లక్షల పరిహార చెల్లించడంతోపాటు వారి కుటుంబాలకు అండగా నిలవాలని కవిత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
- Advertisement -