Wednesday, April 15, 2026

చివరిదశకు కుటుంబసర్వే

- Advertisement -

చివరిదశకు కుటుంబసర్వే

the family survey came to end

హైదరాబాద్, నవంబర్ 25, (వాయిస్ టుడే)
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తుది దశకు చేరింది. మరోవైపు శనివారం నుంచి వివరాల కంప్యూటరీకరణ కూడా షురూ అయింది. ఈ నెలఖారులోపు ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తుది దశకు చేరింది. చాలా జిల్లాల్లో సర్వే ప్రక్రియ పూర్తి కాగా… మరికొన్నిచోట్ల 90 శాతం దాటింది.  ఇప్పటి వరకు కోటికిపైగా నివాసాల్లో సర్వే పూర్తి అయింది. మరో పది శాతం ఇళ్లల్లో సర్వే పూర్తి అయితే వంద శాతం చేరుకుంటుంది.ఓవైపు సర్వేలో భాగంగా వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి కావటంతో మరోవైపు డేటా ఎంట్రీపై అధికారులు దృష్టి పెట్టారు. పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం నుంచి వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నారు.  ఎంపీడీవోతో పాటు పలు కార్యాలయాల్లో ప్రత్యేకంగా డేటాను ఎంట్రీ చేస్తున్నారు. నవంబర్ 30వ తేదీలోపు డేటా ఎంట్రీ పని పూర్తి అయ్యే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలోపు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.మొత్తం 33 జిల్లాల్లో దాదాపు ఎనిమిది నుంచి 9 జిల్లాల్లో సర్వే పూర్తి కావొచ్చింది. ములుగు, జనగాం, వరంగల్ జిల్లాల్లో వంద శాతం వరకు చేరుకుంది. ఈ జిల్లాల్లో డేటా ఎంట్రీ పనులు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లాల్లో 99.9 శాతం, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99 శాతం సర్వే పూర్తి కావొచ్చింది.సర్వే ప్రక్రియ, డేటా ఎంట్రీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.మొత్తం 33 జిల్లాల్లో దాదాపు ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయినట్టు సమాచారం. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు వంద శాతం పూర్తి కాగా నల్గొండ, మెదక్ జిల్లాల్లో 99.9 శాతం, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99 శాతం సర్వే పూర్తయినట్టు తెలుస్తోందికామారెడ్డి జిల్లాలో 98.5 శాతం పూర్తికాగా.. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. జన సాంద్రత ఎక్కువగా ఉండటంతో.. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సర్వే కాస్త నెమ్మదిగా సాగుతోందని అధికారులు చెప్తున్నారు. వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, తాళాలు వేసి ఉన్న ఇండ్లను మినహాయిస్తే.. మిగిలిన అన్ని కుటుంబాల సర్వే వంద శాతం పూర్తయిందని అధికారులు చెప్తున్నారు.మొదట్లో ఎన్నో అనుమానాలు, అపోహాలు.. వ్యక్తమైనప్పటికీ కుల గణనతోనే సామాజిక సాధికారత, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభ్యున్నతికి సర్వే ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలకు ప్రజలకు వివరిస్తుండటంతో.. అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు.. వివిధ దశల్లో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాలుపంచుకుంటున్నారు.రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లుగా సర్కార్ గుర్తించింది. నవంబర్ 06 నుంచి 08వ తేదీ వరకు ఇండ్ల గణన చేపట్టగా.. నవంబర్ 9వ తేదీ నుంచి అసలు కుల గణన సర్వేను సర్కార్ ప్రారంభించింది. మొత్తం1,16,14,349 కుటుంబాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 64,41,183 కుటుంబాలుండగా.. పట్టణ ప్రాంతాల్లో 51,73,166 కుటుంబాలు ఉన్నాయని సర్వేలో లెక్క తేలింది. ఈ సర్వే కోసం మొత్తం 87,807 మంది ఎన్యుమరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 47,561, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది విధుల్లో ఉన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించటంతో పాటు ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,788 మంది సూపరింటెండెంట్లు సర్వేలో పాల్గొంటున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్