- Advertisement -
రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
The farmer's family attempted suicideసూర్యాపేట
తుంగతుర్తి మండలం, రావులపల్లి గ్రామంలో 70 సంవత్సరాల క్రితం రైతులు వెళుతున్న కాలిబాట, పంట కాలువలను గ్రామానికి కొందరు తొలగించారంటూ బాధిత రైతు కుటుంబం పెట్రోల్ పోసుకొని
ఆత్మహత్యయత్నం చేశారు. విచారణకు వెళ్లిన తుంగతుర్తి పోలీసుల ఎదుట ఏకంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
రావులపల్లి గ్రామంలో.. 70 సంవత్సరాల నుండి కొంతమంది రైతులు ఒక ప్రక్క బాటను, మరొక ప్రక్క కాలువతో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో బాట, కాల్వపై పెద్దమనుషులు కన్నెర్ర చేసి.. ఏకంగా
ప్రజావాణికి వెళ్లి బాట లేనట్లుగా అధికారులను పక్కదోవ పట్టించారు. అయితే.. గతంలో ఇక్కడకాలి బాట ఉన్నట్టు అధికారులే పేర్కొనడం గమనార్హం. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి
బాధిత రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -




