మొదటి ప్రాధాన్యత గెలుపు సాధ్యమా
కరీంనగర్, ఫిబ్రవరి 19, (వాయిస్ టుడే )
The first priority is to win
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్, మెదక్, నిజామాబా ద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం పరి ధిలో 25,921 మంది ఓటర్లు ఉన్నారు. పట్ట భద్రుల నుంచి మొదటి ప్రాధాన్యతతో అభ్యర్థి గెలవాలంటే ఒక లక్షా 71 వేల ఓట్లు అభ్యర్థికి రావాల్సి ఉంటుంది. పట్టభద్రుల బరిలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉ న్నారు. జాతీయ, రాష్ర్ట పార్టీల నుంచి 10 మంది బరిలో ఉన్నారు. ప్రతి అభ్యర్థి తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓట ర్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో కంటే ఈసా రి ఓట్ల సంఖ్య పెరగడంతో మొదటి ప్రాధా న్యతపై గెలవడం కత్తిమీద సామే.ఎందు కంటే కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీ అభ్య ర్థులతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్ధు లు ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితు లను చూస్తే అభ్యర్థుల విజయావకాశాలు రెండవ ప్రాధాన్యత ఓట్ల మీదే ఆధారపడ నుంది. మొదటి ప్రాధాన్యతలో 51 శాతం ఓట్లు రాకుంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు, కింది అభ్యర్థి నుంచి లెక్కిస్తూ ఎలిమినేట్ చేస్తుంటారు. ఇలా లెక్కింపు చేస్తున్న సమ యంలో 51 శాతం దాటినవారు గెలుపొంది నట్లు ప్రకటిస్తారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కూడా మొదటి ప్రాధాన్య తతో గెలవడం ప్రస్తుతం ఉన్న పోటీని బట్టి చూస్తే అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ రెండు నియోజకవర్గాల్లో సైలెంట్ ఓటింగ్ జరిగితే మాత్రం అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత తోనే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపును సవాల్ తీసుకుని విస్తృత ప్రచారం చేస్తుండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికల ప్రచారాన్ని మరిపిస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగ ర్ ఉమ్మడి జిల్లా ఓటర్ల పాత్ర కీలకం కానుం ది. దాదాపు సగం ఓట్లు ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఇందులో జగిత్యాల జి ల్లాలో 35,281 ఓట్లు, పెద్దపల్లి జిల్లాలో 31,037 ఓట్లు, కరీంనగర్ జిల్లాలో 71,545 ఓట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22,397 ఓ ట్లు ఉన్నాయి. ఇక్కడి ఓట్లే కీలకం కానుండ డంతో అభ్యర్థులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ను కలియ తిరుగుతూ ఆత్మీయ సమ్మేళనా లు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేస్తు న్నారు.