- Advertisement -
ముంపు తగ్గింది….కష్టాలు తీరలేదు
The flood has subsided….the difficulties are not over
విజయవాడ
విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులైంది. ఇప్పుడిప్పుడే వరద ముంపు కాస్త తగ్గుతున్నా ఇంకా లక్షలాది ప్రజలు వరదల్లోనే చిక్కు కుపోయారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వారం రోజులుగా విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటూ వరద సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తు న్నారు. వరద ముంపుకు గురైన డివిజన్, మండలాలకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నా రు. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు వరద సహాయక చర్యలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరి మితం అయ్యాయి. ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతాల ప్రజలకు సర్కార్ నిత్యవసర సరుకులు అందకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -