Tuesday, March 18, 2025

గంగుల కోట బద్దలు కొట్టాల్సిందే…

- Advertisement -

గంగుల కోట బద్దలు కొట్టాల్సిందే…

The fort of Gangula must be broken...

కరీంనగర్, జనవరి 3, (వాయిస్ టుడే)
కరీంనగర్ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ప్రతిసారి రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకున్నా అక్కడ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు మంత్రి పొన్నం, మాజీ మంత్రి గంగుల తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు ‌నేతలు కరీంనగర్‌ ఎన్నికల్లో గతంలో ముఖాముఖి తలపడ్డారు. ఇప్పుడు కరీంనగర్ సిటీ కాంగ్రెస్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్దదిక్కుగా ఉంటే.. బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చక్రం తిప్పుతున్నారు.2023 ఎన్నికలలో కొన్ని సమీకరణాల కారణంగా కరీంనగర్ నుంచి కాకుండా హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు పొన్నం. దానిపై గంగులు కమలాకర్ తనకి భయపడే పొన్నం వేరే ప్రాంతంలో పోటీ చేశారని పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఇటీవల అసెంబ్లీ లో కూడా పొన్నం ప్రభాకర్ పై పరోక్షంగా విమర్శలు చేసారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడ అసెంబ్లీ లో ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు అసెంబ్లీకి పరిమితం కాకుండా కరీంనగర్ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. రానున్న మున్సిపాల్ కార్పొరేషన్ ఎన్నికలు వీరిద్దరికి కీలకంగా మారాయి.కరీంనగర్‌లో బీఅర్ఎస్ ‌కంచుకోటను బద్దలు కొడతానని గతంలోనే పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. గత రెండు ఎన్నికలలో కరీంనగర్ కార్పొరేషన్‌లో బీఅర్ఎస్ హవానే కొనసాగింది. ఆ రెండు ఎన్నికలలో కాంగ్రెస్ గట్టి పోటీ కూడా ఇవ్వలేక పోయింది. కరీంనగర్‌ను వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ కార్పొరేషన్‌లో కూడా తన పట్టు నిలుపుకుంటూనే వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో‌ ఉండడం, పొన్నం మంత్రిగా వ్యవహరిస్తుండడంతో పట్టు సాధించేందుకు‌ ఇదే సరియైన ‌సమయం‌ అని‌ కాంగ్రెస్ ‌భావిస్తుంది. పలువురు బీఅర్ఎస్ కార్పోరేటర్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ‌కండువా కప్పుకున్నారు.మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడవ సారి కూడా గులాబీ జెండా ఎగురవేసేందుకు గంగుల కమలాకర్ వ్యూహాలకు పదును పెడుతూ కార్పొరేటర్లు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో చేసిన‌ స్మార్ట్ సిటి పనులు ఇతర కార్యక్రమాలు తమని గట్టేక్కిస్తాయని గంగుల ధీమాగా కనిపిస్తున్నారు . ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికి ఇద్దరు నేతలూ ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్తలు పడుతున్నారు.పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కరీంనగర్‌లో ఏ చిన్నపాటి కార్యక్రమం జరిగినా పాల్గొంటున్నారు. గతంలో‌ బీఅర్ఎస్ హయంలో‌ జరిగిన అభివృద్ధి ‌పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. స్మార్ట్ సిటీ పనులలో కూడా అక్రమాలు జరిగాయని ఇప్పటికే విచారణకి ఆదేశించారు. మొత్తానికి ఈ ఇద్దరూ నేతలు కూడా ఏ అవకాశం వచ్చిన పరస్పర విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. చేరికలపై దృష్టి పెడుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పటి నుంచే సవాల్‌గా తీసుకుని పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెడుతుండటంతో రెండు పార్టీల శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్