- Advertisement -
బీహార్ లోని పాట్నాలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయిందని డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తాము ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి అమాంతంగా కిందికి దూకింది. అదే సమయంలో ఓ యువకుడు సమయస్పూర్తితో వ్యవహరించాడు. ఆత్మహత్యాయత్నం చేసిన బాలికను సాహసోపేతంగా రక్షించాడు. ప్రస్తుతం ఆ బాలిక చిన్నపాటి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
- Advertisement -