ఆకుపచ్చని కోరుట్లగా తీర్చిదిద్దడమే లక్ష్యం
మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య -ఆనిల్
కోరుట్లలో వనమహోత్సవం
కోరుట్ల,
The goal is to shape the green into a korutla
ఆకుపచ్చని కోరుట్ల పట్టణంగా తీర్చిదిద్దాడమే లక్ష్యంగా అందరు పనిచేయాలని కోరుట్ల మున్సిపల్ చైర్ ర్సన్ అన్నం లావణ్య -అనిల్ అన్నారు.మంగళవారం కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏకీన్ పూర్, సాయిబాబా మందిరం సమీపంలలో 75 వ హరిత వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చైర్ ర్సన్,మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి,ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టెకోమ, వేప,కానుగ, గుల్మోర్ వంటి మొక్కలు నాటి వాటి రక్షణ కోసం ట్రీ గార్డ్స్ అమర్చారు.ఆనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ రానున్న భవిష్య తరాలకు, కాలుష్య నివారణ లేకుండా నాటిన మొక్కలను, సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.ప్రతి ఒక్కరూ ఈ వనమహోత్సవం కార్యక్రమంను ఒక బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలని ,నాటడమే కాకుండా వాటి సంరక్షణకు పాటుపడాలని అలా వాటిని సంరక్షించినప్పుడే వనమహోత్సవం విజయవంతం అవుతుందని అంతే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ గడ్డమీద పవన్, వార్డు కౌన్సిలర్ బద్ది సుజాత, వార్డు సభ్యులు, మున్సిపల్ అధికారులు గజానంద్, ప్రవీణ్, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.