ఇంతవరకు బతుకమ్మ చీరలు ఇవ్వని ప్రభుత్వం
హైదరాబాద్
The government has not provided Bathukamma sarees so far: MLA Madhavaram Krishna Rao
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉందో గత ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరలకు కూడా అంతే ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు
కావస్తున్న ఇప్పటివరకు బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలను ఇవ్వకపోవడం పైన అసహనం వ్యక్తం చేశారు. నేడు కూకట్ పల్లి నియోజకవర్గం లోని రంగధాముని చెరువును ఆయన సందర్శించి బతుకమ్మ
పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాలలో భాగంగా కూకట్ పల్లిలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ ఒక రోజు ముందుగానే అనగా శనివారం
రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు.మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ ప్రభుత్వమైనా కొనసాగించాలని ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపైన నోరు మెదపకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 20వ తేదీ
నుండి 29వ తేదీ వరకు బతుకమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతాయని 29వ తేదీన రంగదాముని చెరువు వద్ద భారీ ఎత్తున సద్దుల బతుకమ్మ జరుగుతుందని సుమారు 70 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే
అవకాశం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో చర్చించి సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేయాలని సూచించారు.


