Sunday, September 8, 2024

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో .. మన బీసీ విద్యార్ధులకు ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది

- Advertisement -
The government pays the fees for our BC students in prestigious educational institutions of the country
The government pays the fees for our BC students in prestigious educational institutions of the country

బీసీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్, జూలై , (వాయిస్ టుడే):  తెలంగాణ బీసీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీలకు ఉన్నత విద్యనందించాలన్న లక్ష్యంతో మన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుందని తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన రాష్ట్ర బీసీ విద్యార్ధులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలు అవుతుందని మంత్రి తెలిపారు.. ఈ పథకంకు సంబంధించి శుక్రవారం విధివిదానాలు ఖరారవుతాయని పేర్కొన్నారు.ప్రీ మెట్రిక్ లాగే పోస్టు మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కూడా సన్నబియ్యం లాంటి సౌకర్యాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. విద్యకోసం ఉన్న స్కీంలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చి లోగో, పేరు శుక్రవారం ఖరారు చేస్తామన్నారు.తెలంగాణ రాకముందు బీసీలకు ఉన్నత విద్య అందించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో బీసీ కులాల వారు ఉన్నత చదువులకు దూరమై కపలవృత్తులకే పరిమితమయ్యేవారని ఆయన అన్నారు. తెలంగాణకు ముందు 19 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవని.. ఇప్పుడు 327 బీసీ గురుకులాలున్నాయని గుర్తు చేశారు.ఇప్పుడు బీసీ విద్యార్థులు చదువుకునేందుకు డిగ్రీ దాకా బీసీ గురుకులాలున్నాయని మంత్రి గంగుల తెలిపారు.1.87 లక్షల పిల్లలు ఆ గురుకులాల్లో చదువుతున్నారని మంత్రి పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించడం సంతోషంగా ఉందని.. బీసీలకు విద్యాప్రధాత సీఎం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పేరుతోనే ఈ స్కీం ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. బీసీలు గ్రూప్-1, సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారని.. బీసీల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్