Thursday, December 12, 2024

న్యాయ వ్యవస్థలోనీ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించలి

- Advertisement -

*న్యాయ వ్యవస్థలోనీ సమస్యలను నూతన ప్రభుత్వం వెంటనే పరిష్కరించలని ప్రభుత్వ లా చీఫ్ సెక్రటరీ కి వినతి పత్రాన్ని ఇచ్చిన కల్పి… లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రి స్వామి కురుమ*
హైదరాబాదులోని తెలంగాణ సచివాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లో ప్రముఖ హైకోర్టు న్యాయవాది లాయర్స్ పోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ సామాజిక చైతన్యత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే నర్రి స్వామి కుర్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లా (న్యాయ పరిపాలన) చీఫ్ సెక్రటరీ ఐ ఎ ఎస్ తిరుపతి ని తెలంగాణ సచివాలయం లో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చిన అనంతరం న్యాయవ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలను నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సరైన న్యాయం చేకూర్చాలని లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు న్యాయ వ్యవస్థలోని ముఖ్యమైన సమస్యలు
1. P.P లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు క్యాడర్ లో నియమితులైన వారు మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కావాలి. కానీ హైదరాబాదులోనే గత 15 సంవత్సరాలుగా అనేకమంది పనిచేస్తున్నారు. అందులో చాలామంది ఆంధ్ర పౌరసత్వం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు దీని వలన తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు చాలా అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని నాంపల్లి ఎల్బీనగర్ కుకట్పల్లి మేడ్చల్ రాజేంద్రనగర్ మల్కాజ్గిరి మొదలైన కోర్టులో 15 సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు ఉదాహరణకు ఓకే ప్లేస్ లో చాలా కాలం నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ క్యాడర్ పీపీలు రాజలక్ష్మి ,శ్రీరాము ,రజిని శైలజ మొదలైన వారు
2. పిపీలుగా జేపీలుగా ఒకే ప్లేస్లో చాలాకాలం పని చేయడం వలన నూతనంగా వృత్తిలోకి వచ్చేటటువంటి వారికి ప్రాక్టీస్ లో చాలా ఇబ్బందులు తలెత్తి వారు న్యాయవాద వృత్తికి దూరమవుతున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జడ్జీలను ట్రాన్స్ఫర్ చేసిన విధంగా ఏపిపీలను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారందరినీ వీలైనంతవరకు ట్రాన్స్ఫర్ చేయాలి
3. కోర్టు కానిస్టేబుల్ గా లైసెన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నవారు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండటం వల్ల నూతనంగా ప్రాక్టీస్ చేసేటటువంటి న్యాయవాదులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది కేసుల విషయంలో కోర్టు కానిస్టేబుల్ లో జోక్యాన్ని తగ్గించి వారిని వెంటనే మూడు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాలి
4. నూతన గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జూనియర్ న్యాయవాదులకు 5 గౌరవ వేతనం చెల్లించాలి
5. న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పడే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి స్టేట్ న్యాయ ప్రొటెక్షన్ ఆక్ట్ తీసుకురావాలి దాని వలన న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చు
6. నూతనంగా హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో నియమించే జిపిలు ఏజీపీలు స్టాండింగ్ కౌన్సిల్ మొదలైన పోస్టుల్లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులకు సరైన ప్రాతినిథ్యం కల్పించాలి
పైన పేర్కొన్నటువంటి సమస్యలను వీలైనంత త్వరగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పరిష్కరించి తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవ్యవస్థలో ఉన్న న్యాయవాదులు అందరికీ న్యాయం చేకూర్చే విధంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నం తెలియజేశారు ఈ కార్యక్రమంలో లాయర్స్ పోరంపర సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్ , తెలంగాణ న్యాయవాదుల సమిత అధ్యక్షులు పద్మారావు ,బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ యాదవ్, లాయర్స్ ఫోరం కార్యదర్శి సుదర్శన్ నేత సత్యనారాయణ మల్లేష్ మహేష్ బాబు అనేకమంది న్యాయవాదులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్