ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
The government's aim is to irrigate every acreస్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
సింగరేణి సహకారంతో
రామగుండం అభివృద్ధి.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్.
గోదావరిఖని
రామగుండం నియోజకవర్గం లోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం నాడు గాంధీ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం,పాలకుర్తి, అంతర్గాం, మండలంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని. పెద్దపల్లి జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపెల్లి జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీ మంజూరు చేస్తారని బహిరంగ సభలో సీఎం చెప్పారని అన్నారు. గోదావరిఖని ప్రాంతానికి నర్సింగ్ కాలేజీని మంజూరు చేశారు , స్థానిక నిరుద్యోగుల 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామని. స్థానిక సింగరేణి సహాయ సహకారాలతో
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా మారుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చిందని , కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామని ఈ విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, దిటి బాలరాజు, కొలిపాక సుజాత,పాతిపెళ్లి ఎల్లయ్య, తిప్పారం శ్రీనివాస్, పెద్దల్లి ప్రకాష్,బొమ్మక రాజేష్, సింహాచలం ఆడపు రవి, హనుమ సత్యనారాయణ,తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




