Thursday, February 26, 2026

రాష్ట్ర అభివృద్ధిని చూసి గవర్నర్ జీర్ణించుకోలేక పోతున్నారు

- Advertisement -

రాష్ట్ర అభివృద్ధిని చూసి గవర్నర్ జీర్ణించుకోలేక పోతున్నారు

The governor is unable to digest the development of the state

             ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్ తీవ్ర విమర్శలు
చెన్నయ్ జనవరి 11
డీఎంకె నేతృత్వం లోని తమిళనాడు ప్రభుత్వం , గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య కొంతకాలంగా బేధాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమం లోనే మరోసారి గవర్నర్‌పై ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఆయన జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ గవర్నర్ అసెంబ్లీకి వచ్చినా ప్రసంగించకుండానే మధ్యలో వెళ్లిపోయారు. ఆయన తీరు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా ఉంది.రాజ్యాంగం ప్రకారం గవర్నర్ బాధ్యతను నిర్వర్తించలేకపోయారు. తమిళనాడు అభివృద్ధి చూసి ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు ” అని సీఎం తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించలేదని ఆరోపిస్తూ గవర్నర్ ఆర్‌ఎన్ రవి , ప్రసంగం చేయకుండానే వెళ్లిపోయారు. “ రాజ్యాంగం, జాతీయ గీతానికి మరోసారి అవమానం జరిగింది. జాతీయ గీతాన్ని గౌరవించడం రాజ్యాంగం ప్రకారం మన ప్రాథమిక విధి. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయి. ” అంటూ ఇటీవల ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ పరిణామంతో అధికార డీఎంకె ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరోసారి విభేదాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రజలను , ప్రభుత్వాన్ని ఆయన ఎప్పుడూ అవమానిస్తున్నారని ఆరోపించిన స్టాలిన్, గవర్నర్ చర్యపై మరోసారి విమర్శలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్