కర్ణాటకను కుదిపేస్తున్న హనీ ట్రాప్
బెంగళూరు, మార్చి 22, (వాయిస్ టుడే )
The honey trap that is shaking Karnataka
కర్ణాటక సహకార శాఖ మంత్రి కె.ఎన్. రాజన్న అసెంబ్లీలో రాజకీయ నేతలపై హనీ ట్రాప్ జరిగిందని ఆరోపించారు. 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ లో పడ్డారన్నారు. వీరిలో రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర స్థాయి నాయకులు కూడా ఉన్నారని చెప్పారు. స్వయంగా మంత్రి అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. విచారణ చేయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సీడీలను చూపించి హనీ ట్రాప్ వీడియోలు అని ఆరోపించారు. అయితే రోజుల్లో సీడీలు, సీడీ ప్లేయర్లు లేవు కాబట్టి .. వాటిని వినియోగిచేవారు దాదాపుగా లేరు కాబట్టి అవన్నీ ఉత్తవేనని భావిస్తున్నారు.సహకార మంత్రి రాజన్న చేసిన ఆరోపణలపై హోం మంత్రి జి. పరమేశ్వర్ స్పందించారు. తోటి మంత్రి చేశారు కాబట్టి ఆధారాలను తీసుకుని దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. అవసరమైతే ఉన్నత స్థాయి దర్యాప్తును ఆదేశిస్తామని ప్రకటించారు. కానీ ఇంకా విధి విధానాలు ప్రకటించలేదు. హనీ ట్రాప్ రాజకీయాలు కర్ణాటకలో కొత్తేమీ కాదు. పరువులు రాజకీయ నేతలు గతంలో హానీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. 2019లో బెంగళూరు పోలీసులు ఒక హనీ ట్రాప్ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని, వారి వ్యక్తిగత క్షణాల వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసిందని పోలీసులు ప్రకటించారు. అయితే సహకార మంత్రి రాజన్న రాజకీయ ఉద్దేశాలతో హనీ ట్రాప్ ఆరోపణలు చేశారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరు ఈ ఆరోపణలకు కారణం అని భావిస్తున్నారు. బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ ఈ హనీ ట్రాప్ ఆరోపమలు.. ఓ కాంగ్రెస్ సీనియర్ సీఎం పదవి కోసం చేస్తున్న రాజకీయం అని ఆరోపించారు. హనీ ట్రాప్ ఆరోపణలపై సీఎం సిద్దరామయ్య స్పందించారు. హనీ ట్రాప్ కు ఎవరైనా పాల్పడి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.