జగిత్యాల జిల్లా:అక్టోబర్ : కోడి గుడ్డు కూర వండలేదని ఓ భర్త.. తన భార్యను కిరాతకంగా చంపేశాడు.ఈ ఘటన జగిత్యాల పట్టణం లో జరిగింది.
జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్‌లో నివాసముంటున్న కట్ట సంజయ్, సుమలత దంపతులకు పండుగ రోజున గొడవ జరిగింది. దసరా పండుగ వేళ మద్యం తాగిన సంజయ్… కోడిగుడ్డు కూర ఎందుకు చేయలేదంటూ సుమలతతో గొడవ పెట్టుకున్నాడు.
ఇద్దరి మధ్య మాటామాటా పెరగటంతో.. తీవ్ర కోపోద్రిక్తుడై భార్యపై దాడి చేశాడు. విచక్షణ కోల్పోయిన సంజయ్.. భార్య గొంతు నుమిలి చంపేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ధర్యాప్తు చేస్తున్నారు.
పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. స్థానికుల చెప్పిన వివరాల మేరకు పోలీసులు ఆయా కోణాల్లో విచారణ చేస్తున్నారు.