విగ్రహాల లొల్లితో ప్రజలకు ఒరిగేదేముంది
ఆ రెండు పార్టీలకు పుట్టగతులుండవ్..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్
The idols will make people laugh
దమ్ముంటే రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలి. అందరికీ రుణమాఫీ చేస్తే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన అవసరం ఏముంది? రుణమాఫీ అంతా భోగస్. 70 శాతం రుణమాఫీ జరగనేలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలి, అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. ఏమన్నారంటే.
రుణమాఫీ అంతా భోగస్. 70 శాతం మంది రైతులకు రుణమాఫీ జరగనేలేదు. దీనికి ప్రభుత్వం నుండి సమాధానం లేదు. వాళ్లకు నిజంగా చిత్తుశుద్ది ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలి. ఎంత మంది రైతులు రుణం తీసుకున్నారు? ఎంత డబ్బు అప్పు తీసుకున్నరు? ప్రభుత్వం ఎంత మాఫీ చేసిందో గణంకాలతోసహా శ్వేత పత్రం విడుదల చేయండి. అంతే తప్ప అబద్దాలతో రైతులను మోసం చేయొద్దని కోరుతున్నా. మీరు నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు రొడ్డెక్కి ఎందుకు ఆందోళన చేస్తున్నరు?
రైతులకు భరోసా రాలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఇవ్వలే. మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500 లు ఇవ్వలేదు. ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చర్చను దారి మళ్లించేందుకు రాజీవ్ విగ్రహాంపై సవాళ్లు, ప్రతివాళ్లు విసరుకుంటున్నరు. ఇప్పుడు చర్చ జరగాల్సింది విగ్రహాల గురించి కాదు. 6 గ్యారంటీలపైనే చర్చ జరగాలి. వీటిపై దారి మళ్లిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పుట్టగతులుండవు.