తప్పుడు కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వం

- Advertisement -

తప్పుడు కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వం

The Kutami government is making false cases

విశాఖపట్నం
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నాయని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం 100 మందిని అరెస్టు చేసింది అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసే పాపాలు నాగుపాములై లోకేశ్ను కాటేస్తాయి అని హెచ్చరించారు. చంద్రబాబు చేసే పాపానికి పదింతలు శిక్ష లోకేశ్ అనుభవిస్తారు అని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తుపెట్టు కోవాలి అని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు అని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలకు వైసీపీ అండగా నిలుస్తుంది అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి భరోసా ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular