నేతల బాగోతాలు బయిట పెడతా
హైదరాబాద్, మార్చి 17
The leaders' grievances will be exposed.
తెలంగాణలో రాజకీయాలు వెరైటీగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేతలు మీడియా కంటే చిట్ చాట్ కి ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు. దీని వెనుక కారణాలు ఏమైనా కావచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలంతా ఓకే. చివరకు విపక్ష బీఆర్ఎస్ సైతం మీడియాతో చిట్‌చాట్‌కి ఎక్కువ ప్రయార్టీ ఇస్తోంది. తాజాగా అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు కేటీఆర్.గతంలో కేటీఆర్ కొత్త విషయాలు చెప్పేవారు. ఇలాంటి అలాంటిదేమీ లేదని అంటున్నారు. ఎప్పటి మాదిరిగా ఆయన అధికార పార్టీపై దుమ్మెత్తిపోశారు. ఎప్పటి మాదిరిగానే నేతలకు మూటలు పంపిస్తున్నారంటూ మాట్లాడే ప్రయత్నం చేశారాయన. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. ఢిల్లీకి పంపే మూటల గురించి చెబుతున్నారని కామెంట్స్ చేశారాయన.బడ్జెట్ ఎప్పుడన్నది అప్పుడే కేటీఆర్ మరిచిపోయినట్టు ఉందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈనెల 19న సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ చిన్న లాజిక్‌ను ఆయన ఎలా మరిచిపోయారని కాంగ్రెస్ పార్టీ నుంచి సెటైర్లు పడిపోతున్నాయి. ఇక బీజేపీ-కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ కామెంట్స్‌ను ఎందుకు ఖండించటం లేదన్నది ఆయన మాట.సహజంగానే పార్టీలో ఇలాంటివి జరుగుతాయని కొందరు నేతల మాట. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని, అమెరికాలో ఉన్నవాడు కామెంట్ చేస్తే, ఎలా శిక్షిస్తారనిఅన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.సాగర్ సొసైటీలో ఎవరు, ఎంత సమయం గడిపేవారో మాకు అన్నీ తెలుసన్నారు కేటీఆర్. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కొందరు నేతలు ఉదయాన్నే బయటకు వెళ్తున్నారని చెప్పారు. పార్టీ నేతలపై విరుచుకుపడుతున్న రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని అన్నారు.ఇక బీజేపీ నేతల బాగోతాలు తన దగ్గర ఉన్నాయని, పదేళ్ళు అధికారంలోకి ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు రియాక్ట్ కాలేదన్నది ఆయన మాటకాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. శాసనమండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానంగా పోల్చారని, అవన్నీ అబద్ధమని మండలి సాక్షిగా బయటపడిందన్నారు.కల్యాణ మస్తు స్కీమ్ ద్వారా లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారని, ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని సమాధానం చెప్పారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఆ తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.