Thursday, October 17, 2024

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

- Advertisement -

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

The lives of great people should be taken as an example 

– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మహాకవి వాల్మీకి జయంతి పురస్కరిం చుకొని గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. మహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ  మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి  అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని, రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని కలెక్టర్  పేర్కొన్నారు. రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు, మానవ సంబంధాలు, విలువలను మహాకవి మనందరికీ బోధించారని  అన్నారు. మహాకవి వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని కలెక్టర్ తెలిపారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడీబడి ఉందని కలెక్టర్ తెలిపారు.
మహాకావ్యం రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతిని పండగగా జరుపుకోవడం సంతోషకరమ ని  కలెక్టర్ తెలిపారు. అనంతరం వక్తలు మహర్షీ వాల్మీకి జీవిత విశేషాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్,  కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు ప్రకాష్ సునీత ,పద్మావతి, కలెక్టరేట్ సిబ్బంది, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్