సర్దార్ వల్లభబాయి పేరు తో ముఖ్య ద్వారం

- Advertisement -
The main gate with the name of Sardar Vallabhbhai
The main gate with the name of Sardar Vallabhbhai

మంగళగిరి డిజిపి కార్యాలయ భవన ఆవరణలోని  ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కు సులువుగా చేరుకునే విధంగా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన సి‌సి రోడ్డు, ముఖద్వారం, డ్రైయిన్ ను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, ఎమ్మెల్సీతో   కలిసి ప్రారంభించిన డి‌జి‌పి రాజేంద్ర నాథ్ రెడ్డి గారు

విజయవాడ- చెన్నై జాతీయ రహదారి మంగళగిరి వద్ద ఉన్న ఏపీఎస్పీ 6వ బెటాలియన్ సిబ్బందిని  తరలింపుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పటి నుండో ఇక్కడ సేవలను అందిస్తున్న  6వ బెటాలియన్ సిబ్బంది అత్యావసర విధులో భాగంగా వేరొక ప్రాంతానికి చేరుకోవాలంటే సరైన కనెక్టింగ్ రోడు లేకపోవడం తో ఇబ్బందులను ఎదుర్కునేవారు. బెటాలియన్ లోని అధికారులు, స్థానికులు తాము ఎదుర్కుంటున్న సమస్యలను ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారి దృష్టికి తీసుకొనివేళ్ళడం తో వారి అభ్యర్థన మేరకు స్థానిక కమిషనర్ గారు మరియు స్పెషల్ అధికారి జాయింట్ కలెక్టర్ గారు  ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా చర్యలు చేపట్టి  రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులతో చేపట్టిన  సి‌సి రోడ్డు, దేశ ప్రధమ హోం మంత్రి  సర్దార్ వల్లభబాయి పేరు తో నిర్మించిన ముఖ్య ద్వారం, ఇరువైపుల వీధిదీపాలను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, ఎమ్మెల్సీతో   కలిసి డి‌జి‌పి రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రారంభించారు.

The main gate with the name of Sardar Vallabhbhai
The main gate with the name of Sardar Vallabhbhai
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular