- Advertisement -
సల్వా జుడుం లో పని చేస్తున్నాడని గిరిజనుడిని హతమార్చిన మావోయిస్టులు
The Maoists who killed the tribesman because he was working in Salwa Judum
బీజాపూర్ జి
బీజాపూర్ జిల్లా భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కేశముండి సోందీ గ్రామం లో సల్వాజుడుంలో పని చేస్తున్నాడని ఆరోపిస్తూ మావోయిస్టు లు ఆదివారం రాత్రి 7 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. సీపీఐ-మావోయిస్ట్ భైరామ్గఢ్ ఏరియా కమిటీ తో జారీ చేసిన కరపత్రాన్ని అక్కడే వదిలి వెళ్లారు. అందులో సాల్వాజడుం లో కేశముండి పని చేస్తూ మావోయిస్టు ల ఆచూకి పోలీసులకు చెబుతున్నాడని అందుకే హతమార్చామని పేర్కోన్నారు. మావోయిస్టులకు ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఎవరికయినా ఇదే గతి పడుతుందని హెచ్చరించి వెళ్లారు. ఈ ఘటనతో ఆ గ్రామం తో పాటు చుట్టు ప్రక్క గ్రామాలలో భయందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న భైరంఘర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో పోలీసులు నిరంతరం విజయం సాధించడంతోపాటు కోర్ ఏరియాలో కొత్త భద్రతా శిబిరాన్ని నిర్మించడం వల్ల మావోయిస్టు పార్టీ చాలా నష్టపోయిందని అందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు.
- Advertisement -



