Thursday, April 24, 2025

విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న మధ్యాహ్న భోజన పథకం..

- Advertisement -

విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న మధ్యాహ్న భోజన పథకం..

The mid-day meal scheme is becoming a curse for the students.

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్..

జమ్మికుంట

తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, విద్యార్థుల పాలిట మధ్యాహ్న భోజనం శాపంగా మారుతుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, అన్నారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకాన్ని హుజురాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన అనంతరం ఆయన మాట్లాడారు. గడిచిన వారం రోజుల నుంచి గురుకులాలతో పాటు మధ్యాహ్న భోజనం తో చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. రెండు రోజుల క్రితం జమ్మికుంట కస్తూరిబా పాఠశాలలో 10 తరగతి చదువుతున్న నిత్యశ్రీ అనే విద్యార్థిని పాఠశాల నిర్లక్ష్యంతోనే మరణించిందని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కో విద్యార్థిపై లక్ష ఇరవై ఐదు వేలు వెచ్చించి వారికి నాణ్యమైన విద్యతో పాటు భోజన సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమైన ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు మొట్టికాయలు వేసిన మార్పు రావడంలేదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎక్కువ శాతం దళితులు, బీసీలు ఉంటారని ప్రభుత్వంపై నమ్మకంతో విద్యార్థులను పాఠశాలలు చేర్పిస్తే ఇలా చేయడం ఎంతవరకు సరైందని ఆయన ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం సరిగా లేదని హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కు  కూడా స్వయంగా చూపించమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలపై నివేదిక తీసుకొని వెంటనే నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్