మున్సిపల్ వైస్ ఛైర్మెన్ శ్రీపతి బానయ్య ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని
The Minister visited the Vice Chairman
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. మంథని పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య తల్లి శ్రీపతి లక్ష్మి ఇటీవల మరణించగా మంత్రి శ్రీధర్ బాబు బానయ్య ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, ఓడ్నాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, నక్క శంకర్, యువజన నాయకులు పెంటరి రాజేందర్, ఎరుకల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.