Thursday, February 12, 2026

ఆలయ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి

- Advertisement -

కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారిని  దర్శించుకున్న మంత్రి జూపల్లి
రూ. 12.15 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి

The minister who laid the foundation stone for the temple development works

భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని  కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ  మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శుంచుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తరువాత  రూ.12.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని అన్నారు. పర్యాటక శాఖ ఆద్వర్యంలో భక్తుల కోసం వసతి సదుపాయాలు కల్పిస్తామని, దీనికి సంబంధంచిన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్