ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు “క్రేజీ కల్యాణం” సినిమా

- Advertisement -

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు “క్రేజీ కల్యాణం” సినిమా
The movie “Crazy Kalyanam” is streaming on the Aha OTT platform.
‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందించారు. గత నెల 16న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “క్రేజీ కల్యాణం” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
తాజాగా ఈ సినిమా ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. యూనివర్సల్ ఎమోషన్స్ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా క్రేజీ కల్యాణం సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఆహా ఓటీటీతో మరింత మంది ప్రేక్షకులకు ఈ సినిమా చేరువ కానుంది.
నటీనటులు –  ‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular