‘హాయ్’ మూవీ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్

- Advertisement -

 ‘హాయ్’ మూవీ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్

The movie ‘Hi’ will stream on ZEE5 Tamil starting September 25.
భారతదేశంలోని అగ్రశ్రేణి సూపర్‌స్టార్స్‌ నటించిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన త‌మిళ జీ5 తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ‘జననాయగ‌న్’కు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత, ఇప్పుడు నయనతార, కవిన్ నటించిన ‘హాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. నేటితరం సంబంధాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా అలరించనుంది.
నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. న‌య‌న్‌, కవిన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. తెరపై వారి కెమిస్ట్రీ కథకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. నయనతార.. ఆత్మవిశ్వాసం, హుందాతనం, స్వతంత్ర భావాలున్న మహిళ పాత్రలో సహజంగా ఒదిగిపోయారు. ఇక కవిన్.. నిజాయతీ, అమాయకత్వం కలగలిసిన యువకుడిగా ఆకట్టుకున్నారు. అతడి పాత్రలో కనిపించే సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇద్దరి నటన సహజత్వం ఉట్టిపడేలా, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను ఆవిష్కరించాయి.
విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ‘హాయ్’.. ప్రేమలో బాధ, తిరస్కరణలు ఎదురైనప్ప‌టికీ ప్రేమ కోసం వెతకడం ఆపని ఓ యువకుడి కథను చెబుతుంది. మరోవైపు కుటుంబ సమస్యలతో సతమతమవుతూ, తనకు ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించే ఓ యువతి కథ కూడా ఇందులో ఉంటుంది. వీరిద్దరి జీవితాలు అనుకోకుండా కలిసిన తర్వాత.. ప్రేమ, అంగీకారం, తమను తాము తెలుసుకునే ప్రయాణం మొదలవుతుంది. ఈ చిత్రంలో ఇంకా ప్ర‌ముఖ న‌టీన‌టులు రాధికా శరత్‌కుమార్, దివంగత నటుడు కె. భాగ్యరాజ్, ప్రభు త‌దిత‌రులు న‌టించారు. వీరి  పాత్రలు ‘హాయ్’కు మరింత బలాన్ని చేకూర్చాయి. కథలో భావోద్వేగాలను మరింతగా పండించడంలో వారి నటన కీలకంగా నిలుస్తుంది. దిగ్గజ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ తెరపై కనిపించిన చివరి చిత్రాల్లో ‘హాయ్’ కూడా ఒకటి కావడం ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆయన నటన ఈ చిత్రానికి చిరస్మరణీయమైన గుర్తింపును అందించనుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమ, సంబంధాలను అర్థం చేసుకునే క్రమంలో నేటి తరం ఎదుర్కొనే భయాలు, ఆశలు, భావోద్వేగాలను ‘హాయ్’ కథనం, సహజమైన పాత్రలతో ఆవిష్కరిస్తుంది. హృదయానికి హత్తుకునే కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం.. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా, వారి మనసులకు దగ్గరయ్యే అనుభూతినిస్తుంది.
ఈ సంద‌ర్భంగా..*జీ5 తమిళ్, తెలుగు, మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ..*“ ప్రేక్షకులకు అర్థవంతమైన, గుర్తుండిపోయే అనుభూతిని అందించే విభిన్న కథలను అందించ‌ట‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఈ క్ర‌మంలో మా మూవీ లైబ్రరీలో ‘హాయ్’ సినిమా చేర‌టం ఎంతో ప్ర‌త్యేకం. నయనతార, కవిన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులతో కూడిన అద్భుతమైన తారాగణం, సరికొత్త కథనం, భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నేటితరానికి సంబంధించిన‌ సమకాలీన అంశాలతో తెరకెక్కినప్పటికీ.. ‘హాయ్’ క‌థ‌, క‌థ‌నం, సరళత ప్రేక్షకులకు హాయిగా అనిపిస్తాయి. నిజాయతీ, హాస్యంతో ఆధునిక సంబంధాల కథను చెప్పడం.. అన్ని వయసుల ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అయ్యేలా చేయడం ఈ సినిమా ప్రత్యేకత. తమిళ జీ5లో ‘హాయ్’ను ప్రత్యేకంగా ప్రీమియర్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఒక మంచి అనుభూతిని పంచే చిత్రంగా ఆదరిస్తారని న‌మ్మ‌కంగా ఉంది” అన్నారు.
*నయనతార మాట్లాడుతూ* “‘హాయ్’లో నేను స్వతంత్ర భావాలు, ఆత్మవిశ్వాసం కలిగిన మహిళ పాత్ర‌లో క‌నిపిస్తాను. తన నిర్ణయాలపై ఎంతో స్పష్టతతో, పట్టుదలతో ఉండే ఆమె.. తనలోని భయాలు, భావోద్వేగ సంఘర్షణలను కూడా మోస్తుంటుంది. బలమైన వ్యక్తిత్వంతో పాటు సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉండటం ఈ పాత్రను నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించేలా చేసింది. తాను ప్రేమించే వారి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే ఆమె.. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. మనసు విప్పి ప్రేమించడం కొన్నిసార్లు కష్టంగా అనిపించినా.. అదే సమయంలో ఎంతో అందమైన అనుభూతిని కూడా ఇస్తుందని ఆమె తెలుసుకుంటుంది. ‘హాయ్’ నాకు ఎంతో దగ్గరైన సినిమా. నేటి ప్రపంచంలో ప్రేమ ఎలా మారుతోంది, సంబంధాలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయనే అంశాలను ఎంతో సహజంగా ఈ సినిమా చూపిస్తుంది. ఒకరికొకరు భిన్నంగా ఉన్నప్పటికీ.. తమలోని అభద్రతలు, భయాలను అధిగమిస్తూ, అంగీకారం, తోడు కోసం ఇద్దరు వ్యక్తులు ఎలా ఒక్కటవుతారనేది ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు. సంబంధాలను కొనసాగించే క్రమంలో మనలో జరిగే అంతర్గత సంఘర్షణలతో పాటు.. కుటుంబం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, అంచనాలను కూడా ఈ సినిమా ఎంతో సహజంగా చూపిస్తుంది. అందుకే ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. విష్ణు ఎడవన్‌తో కలిసి పనిచేయడం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చింది. కథను ఎంతో సున్నితంగా, నిజాయతీగా తెరకెక్కించారు. అలాగే అద్భుతమైన నటీనటులతో కలిసి ఈ ప్రయాణంలో భాగం కావడం ఎంతో సంతోషంగా అనిపించింది. వారి నటన, సెట్స్‌లోని అనుబంధం సినిమాకు మరింత భావోద్వేగాన్ని తీసుకొచ్చాయి. ఈ పాత్రల్లో ప్రేక్షకులు తమలోని కొన్ని భావాలను చూసుకుంటారని, కథలోని ఆప్యాయత, నిజాయతీ, క‌థాంశంతో కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను. తమిళ జీ5లో ‘హాయ్’ను ప్రేక్షకులు చూసి.. ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను” అన్నారు.
*కవిన్ మాట్లాడుతూ..* “‘హాయ్’లో నాకు అన్నింటికంటే బాగా నచ్చిన విషయం.. తనలోని భావోద్వేగాలను దాచుకోకుండా..తన మనసులో ఉన్నదాన్ని నిజాయతీగా వ్యక్తం చేసే ఓ యువకుడిని కథానాయకుడిగా చూపించడం. సాధారణంగా పురుషులు తమ భావోద్వేగాలను బయటకు చెప్పకుండా ఉండాలని సమాజం ఆశిస్తుంది. కానీ నా పాత్ర మాత్రం తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తుంది. అందుకే అతని పాత్ర ఎంతో సహజంగా, ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ప్రేమ‌, ప్రేమ తిర‌స్క‌ర‌ణ‌, ఆత్మన్యూనత భావం, తాను సరిపోతానా లేదా అనే భయం.. ఇలా ఎన్నో భావోద్వేగాల మధ్య ప్రయాణిస్తూ, తన జీవితంలో అర్థవంతమైన ప్రేమను పొందాలనే ఆశను మాత్రం వదులుకోని యువకుడిగా ఈ పాత్ర ఉంటుంది. బంధాల్లోని సంతోషాలు, బాధలు, ఎత్తుపల్లాలను ఎంతో సహజంగా, ఆప్యాయంగా చూపించడమే ఈ కథ ప్రత్యేకత. నా పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, అతను తీసుకునే నిర్ణయాలు, తాను ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకోవడానికి పడే కష్టాలు.. ఇవన్నీ నేటి యువతకు ఎంతో సులభంగా కనెక్ట్ అవుతాయి. దర్శకుడు విష్ణు ఎడవన్ ప్రేమ, హాస్యం, భావోద్వేగాలను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఒక అందమైన, హృదయానికి హత్తుకునే సినిమాను తెరకెక్కించారు.
జెన్ మార్టిన్ అందించిన మెలోడీతో కూడిన సంగీతం, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక ‘రసగుల్లా’ పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచి ప్రేక్షకుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాని ఎనర్జీ, క్యాచీ మెలోడీ అందరినీ ఆకట్టుకోవడంతో.. ఈ పాటకు ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. ‘హాయ్’కు ఇప్పటికే లభించిన ప్రేమ, ప్రశంసలు మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులు తమిళ జీ55 ద్వారా ఈ ప్రత్యేకమైన కథను చూసి ఆస్వాదించబోతుండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది” అన్నారు.
ప్రేక్షకులు ఈ సరికొత్త ప్రేమకథా చిత్రాన్ని సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో ప్రత్యేకంగా వీక్షించవచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular