‘రావు బహదూర్’ మూవీ జూలై 3న వరల్డ్ వైడ్ రిలీజ్

- Advertisement -

‘రావు బహదూర్’ మూవీ జూలై 3న వరల్డ్ వైడ్ రిలీజ్

The movie ‘Rao Bahadur’ releases worldwide on July 3rd.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, అలాగే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘ఓ సుందరి’ పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. వింటేజ్ వాతావరణాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేసిన ఆ పాటలోని మెలోడీ, విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ వయసు పైబడిన రాయల్ లుక్‌లో కనిపించారు. రాయల్ పర్పుల్ దుస్తులు, ముత్యాల అలంకరణలు, హ్యాండ్ ఫ్యాన్, వెనుక గ్రాండ్ సెటప్ కలిసి ఓ మిస్టీరియస్ అరిస్టోక్రాటిక్ ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. పోస్టర్ మొత్తం సైకాలజికల్ డ్రామాకు తగ్గట్టుగా ఇంటెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. కార్తిక్ పరమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, స్మరణ్ సాయి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను రోహన్ సింగ్ నిర్వహిస్తున్నారు.
రాయల్ విజువల్స్, మిస్టీరియస్ టోన్‌తో ‘రావు బహదూర్’ నేవర్ బిఫోర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ నుంచి మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయి.
తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular