మున్సిపల్ కార్యాలయాన్ని ఆగస్టు నెలలో ప్రారంభించాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి మున్సిపల్ సోంత ఆదాయం పెంపు దిశగా ప్రత్యేక చర్యలు
The municipal office should be opened in the month of August
ఆగస్టు నెలలో 30 కోట్ల అభివృద్ధి పనులు గ్రౌండ్ చేయాలి
పట్టణంలో కుక్కలకు పూర్తి స్థాయిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి
పెద్దపల్లి మున్సిపాలిటీ పై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి
పెద్దపల్లి పట్టణంలో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ఆగస్టు నెలలో ప్రారంభించాలని, ఆ దిశగా పెండింగ్ పనులు, గ్రీనరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించి పురపాలక కార్యాలయంలో పట్టణ అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. ఎల్లమ్మ చెరువును పరిశీలించిన కలెక్టర్ మినీ ట్యాంక్ బండ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక లు రూపొందించాలని అధికారులకు సూచించారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద టాయిలెట్ల నిర్మించాలని కలెక్టర్ తెలిపారు. మినీ ట్యాంక్ బండ్ లో బోటింగ్ నిర్వహణ కోసం అవసరమైన జెట్టి ని త్వరితగతిన తెప్పించాలని, మినీ ట్యాంక్ బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
అనంతరం పురపాలక కార్యాలయంలో పెద్దపల్లి పట్టణ అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీ సొంత ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో మున్సిపాలిటీ కి రావాల్సిన అద్దెలను, ఆస్తి పన్ను, ఇతర పన్నులను
పూర్తి స్థాయిలో వసూలు చేయాలని అన్నారు.
నూతనంగా నిర్మిస్తున్న పురపాలక కార్యాలయాన్ని ఆగస్టు మాసంలో ప్రారంభించుకోవాలని, ఆ దిశగా పెండింగ్ పనులు, కార్యాలయ ఆవరణలో గార్డెనింగ్ , గ్రీనరీ పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణం వ్యాప్తంగా ఉన్న కుక్కలను పట్టుకొని రామగుండం లోని ఏబీసీ సెంటర్ కు తరలించాలని , అక్కడ కుక్కలకు పూర్తి స్థాయిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. పట్టణంలో కుక్కల కారణంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెద్దపల్లి జిల్లాలో 30 కోట్ల రూపాయలతో రూపొందించిన అభివృద్ధి పనులను ఆగస్టు నెలలో గ్రౌండ్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని డంప్ యార్డ్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.