మంథనిలో కొలువుదీరిన నూతన మున్సిపల్ పాలకవర్గం
-మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథని పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తాం
-ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
The new municipal government is based in Manthani.
మంథని
మంథని మున్సిపల్ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఈనెల 13న జరిగిన మంథని మున్సిపల్ ఎన్నికల్లో 13 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11 మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా టిఆర్ఎస్ పార్టీ ఒకటి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక స్థానాల్లో గెలుపొందాయి. మున్సిపల్ పీఠం బీసీ జనరల్ కు రిజర్వు కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి 11వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన ఓడ్నాల శ్రీనివాస్ చైర్మన్ గా, కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన 5వ వార్డు కౌన్సిలర్ ముస్కుల సురేందర్ రెడ్డి వైస్ చైర్మన్ గా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండదండలతో ఎన్నికయ్యారు. మంథని మున్సిపాలిటీకి ఎన్నికైన 13 మంది కౌన్సిలర్లు మంథని మున్సిపల్ కార్యాలయానికి సోమవారం ఉదయం చేరుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి, కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాలకు సంబంధించి మంథని ఆర్డీవో సురేష్ ను ప్రొసీడింగ్ అధికారి గా నియమించారు.ప్రత్యేక గదిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన సీట్లలో వారిని కూర్చుండబెట్టి తెలుగు అక్షర క్రమంలో కౌన్సిలర్లుగా ప్రమాణస్వీకారం చేయించారు. మొదటగా 1వ వార్డు సభ్యులు కుర్ర లింగయ్య,7వ వార్డు సభ్యురాలు జంబోజు శ్రీమతి సమ్మయ్య, 2వ వార్డు సభ్యులు నూకల కమల్,10వ వార్డు సభ్యులు
పెంటరి రాజేందర్,9వ వార్డు సభ్యురాలు
మారుపాక నిహారిక,8వ వార్డు సభ్యురాలు
లైశెట్టి రజిత రాజు,13వ వార్డు సభ్యులు వంశీధర్ ఎల్లంకి,12వ వార్డు సభ్యురాలు వేముల లక్ష్మి సమ్మయ్య,11వ వార్డు సభ్యులు
వోడ్నాల శ్రీనివాస్,5వ వార్డు సభ్యులు
సయేందర్ రెడ్డి ముస్కుల,4వ వార్డు సభ్యురాలు స్రవంతి మద్దికట్ల రమేష్,3వ వార్డు సభ్యులు మాచీడి రాజు గౌడ్, చివరగా
6వ వార్డు సభ్యురాలు పోతరబోయిన శ్రీలత క్రాంతి కుమార్ లు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్ పదవికి నామినేషన్లను ఆహ్వానించగా బీసీ అభ్యర్థి ఓడ్నాల శ్రీనివాస్ ఒక్కరే నామినేషన్ వేయగా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం కౌన్సిలర్లు మద్దికట్ల స్రవంతి, మారుపాక నిహారిక లు ప్రతిపాదించారు. వైస్ చైర్మన్ పదవికి నామినేషన్లను ఆహ్వానించగా సహేందర్ ముస్కుల ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. ఈయనను కౌన్సిలర్లు కుర్ర లింగయ్య, పెంటరి రాజు లు ప్రతిపాదించారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఓడ్నాల శ్రీనివాస్ చైర్మన్ గా, ముస్కుల సహేందర్ రెడ్డిని వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్లు
మంథని ఆర్డీవో,ప్రొసీడింగ్ అధికారి
సురేష్, మంథని మున్సిపల్ కమిషనర్ ఎన్ మనోహర్ లు ప్రకటించారు. అనంతరం వీరితో పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిలర్లందర్నీ ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రూప్ ఫోటోకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి లు మాట్లాడుతూ తమ పై నమ్మకంతో తమను చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఎన్నుకున్న కౌన్సిలర్లకు, సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు యువ నాయకుడు శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రాబోయే రోజుల్లో మంథని పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కష్టపడతామని, మంథని పట్టణ ప్రజలు 13 కౌన్సిలర్ లకు గాను 11 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మంథని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంథని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



