Thursday, February 5, 2026

పాత తరం పాత్రికేయులను మార్గదర్శకంగా తీసుకొవాలి

- Advertisement -

పాత తరం పాత్రికేయులను మార్గదర్శకంగా తీసుకొవాలి
హైదరాబాద్

The older generation of journalists should be taken as a guide.
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయులపై అకాడమీ ప్రచురించిన చిరు పుస్తకాల (మెనోగ్రాఫ్స్) ఆవిష్కరణ, ఇటీవల మరణించిన పాత్రికేయుల కుటుంబాల పెన్షన్ చెక్కుల ప్రదాన కార్యక్రమం బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యా, ప్రజా వ్యవహారాల సలహాదారు కె. కేశవ రావు, తెలంగాణ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ మెనోగ్రాఫ్స్ పుస్తకాలు యువ జర్నలిస్టులు చదవాలి. సీనియర్ పాత్రికేయుల అనుభవాలు , ఆలోచనలు ఈ పుస్తకంలో పొందుబారిచారు. ఇది నేటి జర్నలిస్టులకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు.
పాత్రికేయులుగా పని చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు మీడియా అకాడమీ అండగా నిలవడం అభినందనీయం. వారి కుటుంబాలకు అండగా ఉన్నామని చెప్పేందుకు పెన్షన్ ఇస్తున్నారు. పాత్రికేయ రంగం అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. సోషల్ మీడియా వచ్చాక వారిపై మరింత ఒత్తిడి పెరిగింది. సమాజంలో మార్పు తీసుకురావడంలో పాత్రికేయులది కీలక పాత్ర. పాత తరం పాత్రికేయులను మార్గదర్శకంగా తీసుకొని కొత్తవారు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్