- Advertisement -
జిల్లా పోలీసు శాఖలో కొనసాగుతున్న ఐకమత్య క్రీడా పోటీలు
The ongoing solidarity sports competitions in the district police department
మైదానంలో సిబ్బందిలో ఉత్సాహం నింపేందుకు బౌలింగ్,బ్యాటింగ్ , ఫీల్డింగ్ లలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల
పోలీసు ఉద్యోగులలో మధ్య ఐకమత్యానికి క్రీడాలే ప్రతీకగా నిలవాలనే ఉద్దేశంతో క్రీడా పోటీలను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రారంభించారు.
సోమవారం వెంకటేశ్వరపురం లోనపి ఎస్డీఆర్ స్కూల్ గ్రౌండ్ నందు ఆళ్లగడ్డ, డోన్, సబ్ డివిజన్ల మధ్య మరియు మినిస్టీరియల్ స్టాప్, జిల్లా సాయుధ బలగాల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. గ్రౌండ్ లో సిబ్బందితో పాటు బౌలింగ్ ,బ్యాటింగ్ ,ఫిల్లింగ్ చేస్తూ పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం కలిగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలలో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాట్మెంటన్ మొదలగు గేమ్ లలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న ఈ ఐకమత్య క్రీడా పోటీలలో ఆళ్లగడ్డ ,నంద్యాల ,ఆత్మకూరు, డోన్ సబ్ డివిజన్లకు చెందిన పోలీసులు సిబ్బంది మరియు జిల్లా సాయుధ బలగాల సిబ్బంది , హోంగార్డ్స్ తదితర విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు. క్రీడా పోటీలలో వివిధ పోలీసు జట్లు ఎంతో ఉల్లాసంగా, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పోటీ పడడం వలన సిబ్బందిలో ఉన్నటువంటి పని ఒత్తిడి తగ్గి మానసిక వికాసం కలగడమే కాకుండా, విధులను అంకితభావంతో నిర్వహించడం జరుగుతుందని మరియు శరీర దృఢత్వం ఏర్పడడం జరుగుతుంది జిల్లా ఎస్పీ రు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు జిల్లా సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ చంద్రబాబు మరికొందరు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -