- Advertisement -
హామీల విషయం లో తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు
The opposition is spreading false propaganda in the matter of guaranteesసంగారెడ్డి
సంగారెడ్డి లో టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యం లో స్థానిక. ఆర్ అండ్ బి అతిథి గ్రూహం లో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి.
జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు అన్ని వర్గాల సమక్షం లో ఘనంగా నిర్వహించాం. రాహుల్ గాందీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వం లో శాసన సభ ఎన్నికల సమయం లో ఇచ్చిన ఆరు గ్యారంటీ ల అమలకు కట్టుబడి ఉన్నాం. . సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాటలు విశ్వసించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి కట్టబెట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది పూర్తయ్యింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అయ్యిందని అన్నారు. మరో హామీ రైతు రుణ మాఫీ సైతం దాదాపుగా పూర్తయ్యింది. ఐదువందల కే గ్యాస్ సిలెండర్, రెండు వందల యూనిట్ల విద్యుత్ హామీ సైతం అమలవుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇస్తే తప్ప రు. అందుకు నిదర్శన మే తెలంగాణ ఏర్పాటు. ఒక రాష్ట్రం లో నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీ నీ నిలబెట్టుకున్నారు. హామీల విషయం లో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రజలెవరూ ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని అన్నారు.
- Advertisement -




