మోస పోయామంటున్న రైతాంగం
రైతు ఉసురు తగలడం ఖాయం.!
The peasantry is being cheated
సూర్యాపేట, జూలై20( వాయిస్ టుడే ప్రతినిధి).రుణమాఫీపై సంబురాలు చేసిన ప్రభుత్వాన్ని రైతులు శాపనార్థాలు పెడుతున్నారని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు.
రుణమాఫీ జాబితాలో బూతద్దం పెట్టి వెతికినా పేరు కనిపించకపోవడంతో కన్నెర్ర చేస్తున్నారని.,
మిత్తితో కలిపి లక్ష లోపు ఉన్న రుణం ఎందుకు మాఫీ కాలేదని, ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నాథుడే దొరకట్లేదని.,
వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టేసుకుని ముఖం చాటేస్తున్నారని.,
మార్పు అంటూ కాంగ్రెస్ ను నమ్మి అధికారమిస్తే నిండా మోసగించారని రైతాంగం యావత్తూ లబోదిబో మంటున్నారని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
సాగర్ నీరు విడుదల చేసినందున రైతాంగానికి వెంటనే పెట్టుబడుల కోసం రైతు భరోసా సాయం మొదటగా అందించాలని, రుణమాఫీ పూర్తిస్థాయిలో అందించిన తర్వాతనే సంబరాలు జరుపుకోవాలని వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు.


