సింగరేణిలో ఉన్న పెండింగ్ ఉద్యోగాలను పరిష్కరించాలి.
The pending jobs in Singareni should be resolved.
కమాన్ పూర్
సింగరేణి కంపెనీలో పెండింగ్లో ఉన్న విజిలెన్స్ డిపెండెంట్ ఉద్యోగాలు పరిష్కరించాలి కేంద్రమంత్రి బొగ్గు గని శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాం అని
రామగిరి మండలం సెంటనరి కాలనీలో బిజెపి అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణిలో పెండింగ్లో ఉన్న విజిలెన్స్ కేసులో పరిష్కరించాలని లేనిపక్షంలో వీరందరిని తీసుకుని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని కొన్ని సంవత్సరాలుగా కార్మిక కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న కూడా సింగరేణి కంపెనీ వీరుని పట్టించుకోకపోవడం బాధాకరం గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక కుటుంబాలు రెక్క ఆడితే కానీ డొక్కాడని పరిస్థితికి వచ్చాయి అయినా కూడా సింగరేణి అధికారులు కార్మికుల గోడు వినడం లేదు కుమారుని కు లేక అల్లుడికో కూతురుకు ఉద్యోగమిద్దామనుకొని మెడికల్ అన్ ఫిట్ అయిన తర్వాత కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వమంటే సింగరేణి కంపెనీ మీ పేర్లు తప్పు ఉన్నాయని మీ కులాలు వేరు ఉన్నాయని వారిని ఇబ్బంది చేస్తూ ఉద్యోగం ఇవ్వడం లేదు మరియు లేనిపక్షంలో 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వకుండా కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి సింగరేణి యాజమాన్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అధికారుల తీరు మారడం లేదు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజిలెన్స్ కేసులో పరిష్కరించాలని చెప్పినా కూడా వాళ్లు మాట వినలేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐ ఎన్ టి సి నాయకులు కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించడం లేదు వీరి సమస్యను పరిష్కరించకపోతే విజిలెన్స్ కేసులో ఉన్న కార్మిక కుటుంబ సభ్యులందరిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలాగా చూస్తాం అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బిజెపి మొలుమూరి శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు మెరుగు శ్రీకాంత్ కందుల రమేష్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.