పెన్షనర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటా
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల
పెన్షనర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా,డివిజన్,మండల,పట్టణాల ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే ను కలిసి తమ సమస్యలను వివరించారు.అనంతరం అసోసియేషన్ ముద్రించిన 2024 డైరీలను,క్యాలెండర్లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. .ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి దశ,మలి దశ ఉద్యమాల్లో కేసీఆర్ తో వెంట నడిచిన పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీలో 43 శాతం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.
పెన్షనర్లకు 70 ఏళ్లకే ఖ్వాంటం పెన్షన్ అందించారన్నారు. పెన్షనర్లకు ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే గౌరవ భృతిపై ఆదాయపు పన్ను విధించడంపై పెన్షనర్స్ అసోసియేషన్ చేస్తున్న ఉద్యమాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకొక పోవడము సరి కాదన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ తమ పెన్షనర్స్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, జిల్లా ప్రధానకార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, సహాయ ఆద్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,
ఉపాధ్యక్షుడు ఎండి.యాకూబ్,
ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు,
సత్యనారాయణ,మహిళా కార్యదర్శి బోబ్బాటి కరుణ, సంయుక్త కార్యదర్శి విట్ఠల్,
జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్, కోశాధికారి నర్సయ్య,జాయింట్ సెక్రటరీలు ఎం.డి.ఎక్బాల్,నారాయణ,, సయ్యద్ యూసుఫ్,హన్మాండ్లు, మల్యాల్ అధ్యక్షుడు యాకూబ్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, ప్రతినిధులు దేవేందర్ రావు,కండ్లే గంగాధర్,గంగారెడ్డి,మురళీదర్,జిల్లా,వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.