- Advertisement -
అంగరంగ వైభవంగా కురుమూర్తి రాయుడి గిరి ప్రదర్శన కార్యక్రమం ప్రారంభం
The performance of Kurumurthi Rayudi Giri began with grandeur ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి,
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి
విశ్వహిందూ పరిషత్ పిలుపుమేరకు, తెలంగాణ ప్రాంత ధర్మచారి శివానంద స్వామి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం కురుమూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గిరి ప్రదర్శన కార్యక్రమం వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్యన ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది
దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి వనపర్తి శాసనసభ్యులు మేఘా రెడ్డి హాజరయ్యారు
ఈ సందర్భంగా వారు జండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించి మెట్ల దారిన ఆలయానికి చేరుకొని శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు
- Advertisement -




