నింగిలో రివ్వున ఎగరాల్సిన విమానం నేలకు దిగొచ్చిం ది. లారీపైకి చేరి రోడ్డు మీద పరుగులు పెట్టింది. కర్నూలులో రోడ్డు మీద వెళ్తు న్న విమానాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. లారీ మీద ఉన్న విమానం తో సెల్ఫీలు దిగారు. ఈ విమానాన్ని హోటల్ ఏర్పాటు కోసం దిల్లీ నుంచి కర్నూలుకు తీసుకువచ్చారు.కర్నూలు సిటీ ఆన్ వింగ్స్ బై మార్స్ అనే పేరుతో నగరంలో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తు న్నారు. విమానం థీమ్‌తో రెస్టారెంట్ ఏర్పాటు చేయడమే దీని ప్రత్యేకత. ఇందుకోసం నిర్వాహకులు దిల్లీ నుంచి ఓ లారీలో విమానాన్ని కర్నూలుకు తీసుకువచ్చారు. కర్నూలు నగర శివా ర్లలో ఈ వాహనాన్ని ఆపారు. దీంతో విమానాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. అటుగా వెళ్తున్న వాహ నదారులు, స్థానికులు విమానం రోడ్డెక్కింది అంటూ ఆశ్చర్యంగా దానితో సెల్ఫీలు దిగారు.